logo

పోటెత్తిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు

ములుగులోని సంక్షేమ భవన్‌లో ఏర్పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్‌ కిటకిటలాడింది.

Published : 07 May 2024 06:48 IST

ఓటు వేసేందుకు బారులుతీరిన ఓటర్లు

ములుగు, న్యూస్‌టుడే: ములుగులోని సంక్షేమ భవన్‌లో ఏర్పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్‌ కిటకిటలాడింది. సోమవారం జరిగిన పోలింగ్‌లో 527 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రెండురోజుల్లో మొత్తం 785 మంది ఓటు వేశారు. ఇంటి నుంచి వేయడానికి మొత్తం 77 మంది దరఖాస్తు చేసుకోగా 74 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ముగ్గురి కోసం అధికారులు ప్రయత్నించినా.. వారు అనారోగ్య కారణాలతో గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోయారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి సాంకేతిక కారణాలతో ఓటు వేయడానికి అవకాశం రాలేదు. వీరి కోసం సోమవారం అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు