logo

యువతా.. ఓటు వేస్తే భవిత మీదే!

గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది.

Published : 07 May 2024 07:22 IST

గెలుపోటముల్లో కీలకం..
ఈనాడు, మహబూబాబాద్‌

యువోత్సాహం: ఆదివారం హనుమకొండలో జరిగిన 5కె రన్‌లో..  

గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది. దీంతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.


48.34 శాతం వారే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18-39 ఏళ్ల వారు 16,22,871 మంది ఉంటారు. మొత్తం ఓటర్లలో వీరి శాతం 48.34. మహబూబాబాద్‌ పరిధిలో 50.33, వరంగల్‌లో 46.67 శాతం మంది ఆ వయస్సు ఓటర్లు ఉన్నారు.


పట్టణ యువత కదలాలి

పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్‌ శాతం నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరంగల్‌ నగరంలో తక్కువ మంది ఓట్లేశారు.  యువత తలచుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ పట్టణాల్లోనూ ఓటింగ్‌ శాతం పెంచొచ్చు. కచ్చితంగా వారు ఓటు వేయడంతో పాటు తమ కుటుంబసభ్యులు ఓటేసేలా చూడాలి.


ప్రజా సమస్యలపై స్పందించే వారికే ఓటు
రావుల నవీన్‌, నర్సింహులపేట

మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లోనే తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటు వేస్తా.. ఎవరైతే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందిస్తారో వారినే ఎన్నుకుంటాం.


అభివృద్ధికి పాటుపడే వారికే మద్దతు
రేఖ యాకయ్య, నర్సింహులపేట

ఓటు హక్కు వినియోగించుకోవడం మొదటిసారి. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి అవకాశాలు కల్పించేవారికి ఓటు వేస్తాను.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని