logo

మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి మధ్య వాగ్వాదం

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

Updated : 08 May 2024 07:13 IST

సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్‌

ఈనాడు, వరంగల్‌, గీసుకొండ, న్యూస్‌టుడే: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. గీసుకొండ వైస్‌ ఎంపీపీ భర్త రడం భరత్‌ ఇటీవల కొండా దంపతుల సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌లో చేరడాన్ని రేవూరి వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసిన దరిమిలా కొన్నాళ్లుగా పరకాలలో వర్గ పోరు నివురుగప్పిన నిప్పులా భగ్గుమంటోంది. భరత్‌ను పార్టీలో ఎందుకు చేర్చుకోవడం లేదని, తమకు అనుకూలంగా లేని రాజ్‌కుమార్‌ చేరికను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని కొండా ఫోన్‌లో రేవూరిని గట్టిగా ప్రశ్నించారు. ఎవరినీ ఆపే శక్తి తనకు లేదన్న రేవూరి మాటలకు సురేఖ బదులిస్తూ ‘మీకు ఎమ్మెల్యేగా గెలిచే శక్తి కూడా లేకపోతే మేమే గెలిపించాం’ అని, తమ వర్గాన్ని పార్టీలోకి వచ్చేందుకు అడ్డుకుంటే గీసుకొండ ఎంపీపీ సౌజన్యంపై అవిశ్వాసం పెట్టి వైఎస్‌ ఎంపీపీకి ఆ పదవి ఇస్తామని, ఇక వర్గపోరు తప్పదని సురేఖ తెగేసి చెప్పడంతో ‘తనకు డమ్‌కీలు ఇవ్వొద్దు’ అంటూ రేవూరి గట్టిగా బదులిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వద్ద డబ్బులు తీసుకుంటారని కూడా సురేఖ పలువురు కాంగ్రెస్‌ నేతలపై ఆరోపణలు చేయడం గమనార్హం. దీనిపై కొండా సురేఖను ఫోన్‌లో వివరణ కోరగా. తాను ఈవిషయమై తర్వాత మాట్లాడతానన్నారు. రేవూరికి కాల్‌ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు