logo

హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారా..

‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్‌లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు

Updated : 08 May 2024 06:26 IST

తాటికొండలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. చిత్రంలో సింగపురం ఇందిర

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే : ‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్‌లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు.. గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందలేదని అన్నారు. అనేక హామీలు ఇచ్చాను.. నేను గెలిచిన పార్టీ అధికారంలో లేదని ఆలోచిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాకు ఫోన్‌చేసి శ్రీహరన్నా.. పార్టీలోకి రావాలి.. మీ అనుభవం మాకు కావాలి.. నీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా.. అని చెబితే.. పార్టీ మారాను తప్ప, మరొకటి కాదని వివరించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియోజకవర్గ ప్రజలు ఛీకొట్టినా.. అన్ని పార్టీలు పక్కన పెట్టినా సిగ్గు రావడం లేదు.. సభ్యత, సంస్కారం లేకుండా నీచంగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఆయనకు భారాస పార్టీలో అసలు గుర్తింపు ఉంటే ఎంపీˆ టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతానికి చేసింది శూన్యమని అన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీˆ అభ్యర్థి కావ్య గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీˆపీˆ సుధీర్‌రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్‌రెడ్డి, కట్టమల్లు, శ్రీరాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌, యాదగిరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు