logo

గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు.

Published : 18 May 2024 02:01 IST

జనగామలో ఓటు అభ్యర్థిస్తున్న భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి

జనగామ టౌన్, న్యూస్‌టుడే: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు, గ్రంథాలయ పాఠకులతో సమావేశమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఎన్నో ఆశలను చూపి అధికారంలోకి వచ్చిందని, తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఇతర ఉద్యోగాల భర్తీ కోసం పోరాడుతానని తెలిపారు.  స్థానిక భారాస నేతలు ఎడవెల్లి కృష్ణారెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు