logo

ప్రవేశికలోనే రాజ్యాంగం స్పష్టత

రాజ్యాంగం ద్వారా అన్నివర్గాల ప్రజలకు ఎలాంటి సమానత్వ సేవలు అందేవి, దాని స్వరూపాన్ని ప్రవేశికలోనే పొందుపరిచారని దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్ కార్యదర్శి ఝాన్సీరాణి అన్నారు.

Updated : 26 Nov 2022 17:30 IST

దెందులూరు : రాజ్యాంగం ద్వారా అన్నివర్గాల ప్రజలకు ఎలాంటి సమానత్వ సేవలు అందేవి, దాని స్వరూపాన్ని ప్రవేశికలోనే పొందుపరిచారని దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్ కార్యదర్శి ఝాన్సీరాణి అన్నారు. దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కొవ్వలి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. అందరికీ సమాన న్యాయమే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రధానోపాధ్యాయులు శర్మ మాట్లాడుతూ.. రాజ్యాంగం రచనలో పాల్గొన్నవారు సుమారు మూడు సంవత్సరాలు కష్టపడి అన్నివర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. ఈక్రమంలో డా.అంబేడ్కర్‌ అందించిన సేవలు స్మరించుకోవాలన్నారు. అందరూ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా  కార్యదర్శి బి.కిరణ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని