logo

ఫిలిప్పీన్స్‌ విహంగం.. పెలికాన్‌

కొల్లేరుకు వచ్చే అందాల అతిథి స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌. స్థానికంగా దీనిని గూడబాతు అని పిలుస్తారు. ఇది 4 నుంచి 6 కిలోల వరకు బరువు ఉంటుంది.

Published : 08 Dec 2022 04:34 IST

కొల్లేరు అతిథి

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొల్లేరుకు వచ్చే అందాల అతిథి స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌. స్థానికంగా దీనిని గూడబాతు అని పిలుస్తారు. ఇది 4 నుంచి 6 కిలోల వరకు బరువు ఉంటుంది. ఫిలిప్పీన్స్‌ దేశంలో పుట్టి అక్కడి నుంచి విస్తరించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. సంతానోత్పత్తి కాలంలో మాత్రమే గుంపులుగా వలస వెళ్తాయి. తక్కువ నీటిమట్టం ఉన్న ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని చేపలను వేటాడతాయి. గడ్డి, ఎండిపుల్లలతో 15 నుంచి 20 అంగుళాల చుట్టు కొలతతో గూడు ఏర్పాటు చేసుకుంటాయి. 3 నుంచి 5 గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి. మనదేశంతో పాటు శ్రీలంక, కంబోడియా, దక్షిణ తూర్పు ఆసియాలో మాత్రమే నివాసం ఉంటాయి. ప్రస్తుతం ఈ జాతి పక్షులు 18 వేల వరకు ఉంటాయని అటవీశాఖ అధికారుల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని