logo

పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వీడియో గ్రాఫర్‌పై వైకాపా శ్రేణుల దాడి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్‌, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది.

Published : 08 May 2024 01:38 IST

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్‌, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని వీడియో తీస్తుండగా వీడియోగ్రాఫర్‌ తాళ్ల శ్రీనివాస్‌, అధికారి సీతారామరాజుపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, పిడిగుద్దులతో దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తాళ్ల శ్రీనివాస్‌ సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు స్పందించి ఆయనను హుటాహుటిన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు