logo

మరో‘దారి’ లేదు మరి!

ఉండి మండలం చెరుకువాడ గ్రామ పరిధిలో మారుమూల ప్రాంతమైన కాలువపేటకు చెందిన నిండు గర్భిణి అయినం సౌజన్యకు బుధవారం నొప్పులు రావడంతో ఆమెను స్థానికులు ఇలా కుర్చీలో అరకిలోమీటరు దూరంలో ఉన్న జాతీయ రహదారి వరకు తరలించారు.

Published : 08 Dec 2022 04:34 IST

కుర్చీలో నిండు గర్భిణి తరలింపు

న్యూస్‌టుడే, చెరుకువాడ (ఉండి) : ఉండి మండలం చెరుకువాడ గ్రామ పరిధిలో మారుమూల ప్రాంతమైన కాలువపేటకు చెందిన నిండు గర్భిణి అయినం సౌజన్యకు బుధవారం నొప్పులు రావడంతో ఆమెను స్థానికులు ఇలా కుర్చీలో అరకిలోమీటరు దూరంలో ఉన్న జాతీయ రహదారి వరకు తరలించారు. అక్కడి నుంచి 108 అత్యవసర వాహనంలో ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలువపేటలోని భూలోకరాయుడు కోడు ప్రాంతంలో దాదాపు 40 ఏళ్ల కిందట 22 కుటుంబాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించగా వారు ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి రహదారి సౌకర్యాన్ని కల్పించకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇలాంటి అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఆగస్టు 8న కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందనలో ఫిర్యాదు చేసినట్లు స్థానికుడు మల్లవరపు అక్షయ్‌కుమార్‌ తెలిపారు. ఈ అంశంపై చెరుకువాడ సర్పంచి కొండవీటి సాంబశివరావు, గ్రామ కార్యదర్శి కె.గోపాలకృష్ణలు స్పందిస్తూ భూలోకరాయుడు కోడు ప్రాంతానికి వెళ్లే మలుపులో మూడు అడుగుల వెడల్పుతో ఉన్న కాలువ గట్టే రాకపోకలు ఆధారమని తెలిపారు. ఇక్కడ రోడ్డు నిర్మాణానికి జలవనరుల శాఖతో పాటు రైతుల ఆమోదం అవసరమని చెప్పారు. ఇళ్ల మధ్య మార్గంలో కంకర పరిచేందుకు పంచాయతీ నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.               -

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని