logo

దళితుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం : నిమ్మల

దళితులపై కర్కశంగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూకటివేళ్లతో పెకలించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 07 Jun 2023 04:17 IST

స్టేషన్‌లో రామానాయుడితో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు, ఎమ్మెల్యే రామరాజు

గణపవరం, న్యూస్‌టుడే: దళితులపై కర్కశంగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూకటివేళ్లతో పెకలించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయనను అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం మధ్యాహ్నం గణపవరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఉంగుటూరు నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్టేషన్‌కు వచ్చి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామానాయుడును విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గణపవరం స్టేషన్‌కు వచ్చి నిమ్మలకు సంఘీభావం తెలిపారు. రామానాయుడు మాట్లాడుతూ యలమంచిలి మండలం చించినాడ గ్రామ పరిధిలోని లంక భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలు ఆపాలని దీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి మూడు నాలుగు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పడం ఎంతవరకు న్యాయమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన దళితులను ఆసుపత్రులకు తరలించకుండా స్టేషన్ల చుట్టూ తిప్పడం ఏమిటని ప్రశ్నించారు. దళితులు, బలహీన వర్గాల హక్కుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. మూడు గంటల పాటు స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యేకు ఉన్నతాధికారుల ఆదేశాలతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని