logo

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలి: నిమ్మల

మట్టి దోపిడీకి పాల్పడుతూ దళితులపై దాడులు చేయిస్తున్న నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌లను ఆయా పదవులకు అనర్హులుగా ప్రకటించాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు.

Published : 10 Jun 2023 03:36 IST

భీమవరం డీఎస్పీతో మాట్లాడుతున్న రామానాయుడు, అంగర

పాలకొల్లు, యలమంచిలి, న్యూస్‌టుడే: మట్టి దోపిడీకి పాల్పడుతూ దళితులపై దాడులు చేయిస్తున్న నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌లను ఆయా పదవులకు అనర్హులుగా ప్రకటించాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. యలమంచిలి మండలం చించినాడ గోదావరి పెరుగులంక భూముల్లో తవ్వుతున్న మట్టిని మేడపాడులోని ఇటుక బట్టీలకు తరలిస్తున్న లారీని శుక్రవారం పట్టుకున్న తరుణంలో ఆయన మాట్లాడారు. ఒక్కో లారీ మట్టిని రూ.12 వేలకు విక్రయిసున్న వైకాపా మట్టి మాఫియాకు అనుమతులు ఇచ్చినందుకు కలెక్టర్‌, ఎస్పీలను వెంటనే సస్పెండ్‌ చేయాలన్నారు. దళితులపై దాడులు చేయడమేగాక మట్టి అమ్ముకుంటున్న ముదునూరి, కవురు శ్రీనివాస్‌లపై పోరాటం చేయడానికి మాలమహానాడు, ఎమ్మార్పీఎస్‌లు సిద్ధం కావాలన్నారు.   మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మాట్లాడుతూ హక్కులపై పోరాడుతున్న తెదేపా, సీపీఎం నాయకులను లంకల్లోకి అనుమతించని పోలీసులు వైకాపా నాయకులను మాత్రం అనుమతించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని చెప్పారు.          
కేసు నమోదు: పెరుగులంక భూముల నుంచి మట్టిని మేడపాడు ఇటుకబట్టీలకు తరలిస్తున్న ఒక లారీని సీజ్‌ చేసి  కేసు నమోదు చేసినట్లు ఎస్సై జేవీఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. అక్రమ విక్రయాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

నిఘా వేసి పట్టుకున్న మట్టి లారీ

దాడులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోండి

విజయవాడ, న్యూస్‌టుడే:  చించినాడ గ్రామంలో దళిత, బలహీనవర్గాల వారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం   ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని