logo

రూ.5 పెరిగిన పొగాకు ధర

ఎన్‌ఎల్‌ఎస్‌లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది.

Published : 29 Mar 2024 04:11 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఎన్‌ఎల్‌ఎస్‌లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. జంగారెడ్డిగూడెం ఒకటి, రెండు, కొయ్యలగూడెం, దేవరపల్లిలో మాత్రం రూపాయి చొప్పున పెరుగుదల నమోదై రూ.241కు చేరింది. ఈ పెరుగుదల కూడా కొనుగోలు కేంద్రాల్లో రెండు, మూడు బేళ్లకే పరిమితం అవుతోంది. పొగాకు కంపెనీలు ఇష్టపూర్వకంగా పెంచిన ధరలు కావని అధికారులు, రైతులు చెబుతున్నారు. బయ్యర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో పొరపాటున అక్కడక్కడ ఎక్కువ నమోదవడమే దీనికి కారణమంటున్నారు. జంగారెడ్డిగూడెం ఒకటో కేంద్రంలో రెండు, రెండో కేంద్రంలో ఒక బేలుకు ఒక రూపాయి చొప్పున పెంచి రూ.241కు కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని