logo

తొలి రోజు ఓటేసిన 7,540 మంది

జిల్లాలో తపాలా బ్యాలెట్‌ పోలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 13,854 మంది ఓటర్లు ఉండగా తొలిరోజు 7,540 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు

Published : 07 May 2024 06:05 IST

 భీమవరం: ఓటు వేసేందుకు వరుసలో ఉన్న ఉద్యోగులు
భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో తపాలా బ్యాలెట్‌ పోలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 13,854 మంది ఓటర్లు ఉండగా తొలిరోజు 7,540 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించి భీమవరం పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పర్యవేక్షించారు. సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య, ఆర్డీవో శ్రీనివాసులరాజు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మిగిలిన అయిదు నియోజకవర్గాల్లోనూ సంబంధిత కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ జరిగింది.

11వ తేదీ వరకు అవకాశం.. సోమ, మంగళవారాల్లో ఓటు వేయలేకపోయిన వారు 8, 9, 10, 11 తేదీల్లో సంబంధిత ఆర్వో కార్యాలయాల్లో తపాలా బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని