logo

గోదారికి వదిలేసిన జగన్‌

వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటిగట్టు పరిరక్షణ పనుల నుంచి గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది.

Published : 08 May 2024 05:48 IST

అయిదేళ్లలో ముట్టుకుంటే ఒట్టు!

ప్రతిపాదనలే.. పనులు చేసింది లేదు

 డెల్టా ఆయువుపట్టును పట్టించుకోని వైకాపా సర్కారు

వై.వి.లంక సమీపంలో కుచించుకుపోయిన గట్టు


గట్టును...

యలమంచిలి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటిగట్టు పరిరక్షణ పనుల నుంచి గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. 2019లో పలు ప్రతిపాదనలు చేసిన తర్వాత, నిధులు విడుదల చేసేది లేదని ఉన్నతాధికారులు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో గ్రోయిన్ల ప్రతిపాదనలు చేయడమే మానేశారు. మూడేళ్ల తర్వాత 2022లో వచ్చిన భారీ వరదల్లో పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులంక, పల్లిపాలెంలంక, యలమంచిలి మండలం దొడ్డిపట్ల, యలమంచిలిలో గట్టు తెగిపోయేంత ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. స్థానికులే ఎక్కడికక్కడ శ్రమదానం చేసి ఇసుక బస్తాలతో గట్టును కాపాడుకున్నారు. ఇదంతా చూసిన ముఖ్యమంత్రి ప్రతిపాదనలు చేయమని ప్రకటించారే తప్ప, పనులకు నిధులు విడుదల చేయడంలో చేతులెత్తేశారు. అదే సమయంలో నరసాపురం పట్టణంలో పొన్నపల్లి దగ్గర గట్టు జారడంతో అక్కడ మాత్రం రూ.26 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించినా అనతి కాలంలోనే నాణ్యతా లోపంతో గట్టు రెండుసార్లు జారిపోయింది. మిగిలిన చోట  పనుల ఊసేలేదు.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవడమే.. వశిష్ఠ గోదావరి తీరాన పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లో ఏటిగట్టు పొడవునా ఉన్న గ్రామాల్లో ఏటా వరదొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండటం తప్ప ఆపద నుంచి గట్టెక్కించే శాశ్వత పనులను గడిచిన అయిదేళ్లలో వైకాపా సర్కారు చేయలేదు. వరదలొచ్చినపుడు హడావుడి చేసి ప్రతిపాదనలు చేయడం మినహా ఎక్కడా తట్ట మట్టేసి పుణ్యం గట్టుకోలేదని యలమంచిలికి చెందిన చిలుకూరి మల్లేశ్వరరావు వాపోయారు. ఆచంట మండలం నుంచి యలమంచిలి, నరసాపురం మండలాల వరకు ఏటిగట్టుపై పలు ప్రాంతాలు బలహీనంగా ఉండటంతో ఎటువంటి ముప్పు తెస్తుందోనన్న ఆందోళన ఆయా ప్రాంతాల ప్రజల్లో నిరంతరం కొనసాగుతుంది. ఆచంట మండలంలో.. బలానంగా ఉన్న గట్టుపై 25 టన్నుల బరువుగల వాహనాలు తరచూ తిరగడంతో గట్టుకు ముప్పు ఏర్పడుతోంది.

- ఇదీ 2022 జులై 26న వరదల సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ అన్నమాటలివి.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలైతే చేశారు కాని పనుల నిమిత్తం పైసా విదిల్చిన పాపాన పోలేద


గోదావరి వరదలతో ఇకపై భారీ నష్టం జరగకుండా శాశ్వత పనులు చేపట్టాలి. మీడియాలో వస్తున్న కథనాలపై అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారం చేస్తే దీటుగా తిప్పికొట్టాలి. కరకట్టలు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసి నవంబర్‌ నాటికి టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు