logo

మరో రెండు చోట్ల ఇసుక ర్యాంపులు

ఆచంట నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల వారికి త్వరలో ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఓపెన్‌ రీచ్‌లైన కోడేరు, కరుగోరుమిల్లిలో తవ్వకాలు చేసేందుకు జేపీ సంస్థ సన్నద్ధమవుతోంది. రెండు చోట్లా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ర్యాంపు పనులు చేపట్టింది.

Published : 21 Jan 2022 05:20 IST

కోడేరులో సాగుతున్న పనులు

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల వారికి త్వరలో ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఓపెన్‌ రీచ్‌లైన కోడేరు, కరుగోరుమిల్లిలో తవ్వకాలు చేసేందుకు జేపీ సంస్థ సన్నద్ధమవుతోంది. రెండు చోట్లా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ర్యాంపు పనులు చేపట్టింది. ఈ నెలాఖరు కల్లా విక్రయాలు చేపట్టే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంత వాసులు తూర్పుగోదావరి, కొవ్వూరు నుంచి ఇసుక కొనుగోలు చేయడంతో రవాణా ఖర్చు భారంగా మారింది. రెండు ర్యాంపులు అందుబాటులోకి వస్తే కిరాయి తగ్గుతుందని స్థానిక వినియోగదారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని