logo

ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు

జూన్‌ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్‌లో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

Published : 23 May 2024 03:19 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జూన్‌ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్‌లో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రమైన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఉర్దూ నేషనల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో 112 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున ఈవీఎం బళ్లలు, పోస్టల్‌బ్యాలెట్‌కు 14 బళ్లలను ఏర్పాటు చేశామన్నారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి 20 రౌండ్లు, కడప-21, పులివెందుల- 22, కమలాపురం- 23, ప్రొద్దుటూరు-20, మైదుకూరు- 20, జమ్మలమడుగుకు 23 రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. సిబ్బందికి మూడు దఫాలుగా ర్యాండమైజేషన్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుందని, కేంద్రంలో అభ్యర్థి లేదా కౌంటింగ్‌ ఏజెంటు మాత్రమే ఉంటారని, ఇతరరులెవ్వరికీ చోటు లేదన్నారు. జూన్‌ ఆరో తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని