logo

Jagananna Colony: కొండలు... బండలు...ఇదే జగనన్న కాలనీ!

కొండలు, బండలున్నచోట జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం అన్యాయమని జనసేన పార్టీ నాయకుడు డాక్టర్‌ మైఫోర్స్‌ మహేష్‌ అన్నారు.

Updated : 13 Nov 2022 09:38 IST

నిమ్మనపల్లెలో జనసేన పార్టీ  నేతల పరిశీలన

నిమ్మనపల్లె రోడ్డులో జగనన్న కాలనీ వద్ద నిరసన  
తెలుపుతున్న జనసేన పార్టీ నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: కొండలు, బండలున్నచోట జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం అన్యాయమని జనసేన పార్టీ నాయకుడు డాక్టర్‌ మైఫోర్స్‌ మహేష్‌ అన్నారు. నిమ్మనపల్లె రోడ్డులోని జగనన్న కాలనీని శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు పునాదుల నిర్మాణానికే సరిపోతోందన్నారు. నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేసుకోమంటే ఎలాగని ప్రశ్నించారు. టిడ్కో గృహాలు మంజూరు చేస్తామని లబ్ధిదారులు నుంచి రూ.వేలు కట్టించుకుని ఇంత వరకు దాని ఊసేలేదన్నారు. నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శోభ, స్వరూప, మహేంద్ర, నరేష్‌, మనోజ్‌, శ్రీనాథ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని