logo

అభివృద్ధి... సంక్షేమం రెండు కళ్లు

అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Published : 31 Jan 2023 02:43 IST

జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే : అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో ప్రజలకు అందిస్తూనే, ఈ మూడేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేశామన్నారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. మూడేళ్ల సంక్షేమ పాలనలో డీఆర్సీ సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లాలో సంక్షేమానికి, అభివృద్ధికి అనేక తీర్మానాలు చేశామన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. పారదర్శకంగా, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కలెక్టరు విజయరామరాజు మాట్లాడుతూ జిల్లాలోని జలాశయాల్లో   69.691 టీఎంసీల నీరు నిల్వ ఉందని, సాగు, తాగు నీటి అవసరాలకు కొరత లేదన్నారు. అనంతరం శాఖలవారీగా జిల్లాలో సాధించిన ప్రగతిని కలెక్టరు వివరించారు. * పంచాయతీరాజ్‌, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్తు శాఖల పరిధిలో 1,217 పనులు మంజూరు చేయగా, కొన్ని పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా 11,565.445 మెట్రిక్‌ టన్నుల ఎరువులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 2022-23 ఏడాదిలో మొదటి విడతలో 1,98,074 మంది రైతులకు రూ.192.96 కోట్లు రైతు భరోసా సాయాన్ని పంపిణీ చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని