logo

సీపీఎస్‌ రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం

కాంట్రిబ్యూటరీ పింఛను స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌,  తిమ్మన్న హెచ్చరించారు. 

Published : 04 Feb 2023 05:05 IST

కలెక్టరేట్‌ ఎదుట ఓపీఎస్‌ సాధన దీక్షలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : కాంట్రిబ్యూటరీ పింఛను స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, లేదంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌,  తిమ్మన్న హెచ్చరించారు.  జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో ‘ఓపీఎస్‌ సాధన దీక్ష’ నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తును రోడ్డుపాలు చేసేలా 2004, సెప్టెంబరు నుంచి సీపీఎస్‌ అమలులోకి వచ్చిందన్నారు. 30 ఏళ్లు సర్వీస్‌ చేసి ఉద్యోగవిరమణ చేసిన అనంతరం, సర్వీసులో ఉండగా మరణించిన సందర్భంలో ఏ విధమైన భద్రత, భరోసా లేకుండా చేసిన సీపీఎస్‌ను తక్షణమే రద్దుచేయాలని డిమాండు చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ అమలు చేయకపోవడం సరికాదన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ పాఠశాలల సందర్శనల పేరుతో ఉపాధ్యాయులను భయాందోళనలకు గురిచేస్తూ వారిని మానసికంగా వేధించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లోనే సీపీఎస్‌ రద్దు బిల్లు ప్రవేశపెట్టాలని, లేనిపక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడానికి వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు మల్లు రఘునాథరెడ్డి, కంభం బాలగంగిరెడ్డి, రమణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, నరసింహులు, అబ్దుల్‌వాజీద్‌, సుబ్రహ్మణ్యంరాజు, గంటామోహన్‌, చంద్రశేఖర్‌, ఇలియాస్‌బాషా, నాగరాజు, సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని