logo

ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

సీఎం జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Published : 24 Apr 2024 02:44 IST

ఈనాడు, కడప : సీఎం జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిపై వీరపునాయునిపల్లెకు చెందిన నాగప్రసాద్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నివాసం లేని భవనం పేరిట కమలాపురంలో ఓటరుగా నమోదు చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో కడప నగరంలోని స్మిత్‌రోడ్డు వైపునున్న నివాసం చిరునామాతో ఓటరు కార్డు తీసుకున్నారని పేర్కొన్నారు. 2019లో కమలాపురంలో 14/414 చిరునామా ఉన్న భవనం పేరిట ఓటరుగా నమోదు చేసుకున్నారని వివరించారు. ఓటరు కార్డులోని చిరునామా మేరకు నివాసం లేరని, ఓటరు కార్డు, ఆధార్‌కార్డులో చిరునామాలు వేర్వేరుగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తప్పుడు సమాచారంతో ఓటరు నమోదు చేసుకోవడం, దాని ఆధారంగా నామినేషన్‌ దాఖలు చేశారని, దాన్ని తిరస్కరించాలని ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని