logo

పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 04 May 2024 05:41 IST

భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

కలకడలో మాట్లాడుతున్న భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

కలకడ, కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కలకడ తెదేపా కార్యాలయంలో శుక్రవారం తెదేపా, జనసేన, భాజపా కూటమి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనకు అంతం చేయడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇసుక, గనులు, మద్యం అక్రమ రవాణఆా, వనరుల దోపిడీ, భూకబ్జాలతో వైకాపా నాయకులు రూ.కోట్లు గడించారని, రానున్న ఎన్నికల్లో ఓటర్లకు అక్రమ సంపాదనను పంచిపెట్టి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓటర్లు తమ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా, భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ నెల 8వ తేదీ జరిగే ప్రధాని మోదీ పర్యటనకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యప్రకాశ్‌, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షుడు రవిప్రకాశ్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని