logo

షర్మిలకు ఓటేయాలని పిలుపు

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు.

Published : 04 May 2024 05:25 IST

పోరుమామిళ్లలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయజ్యోతి.

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే:   పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. పోరుమామిళ్లలో శుక్రవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. రాష్ట్రమంతటా వైయస్‌, వివేకాలను ప్రజలు అభిమానిస్తారన్నారు. తన తండ్రిని గొడ్డలితో నరికి చంపారని.. వైయస్‌ఆర్‌ బతికి ఉంటే సహించేవారు కాదన్నారు. ఈ నెల 13వ తేదీ పోలింగ్‌ రోజు ఓటు వేసే సమయంలో ఆలోచించి న్యాయానికి ఓటు వేయలన్నారు. ప్రస్తుత ఎంపీ అవినాష్‌ని కలవాలంటే తెల్లవారు జామున 5 గంటలకే లైన్‌లో నిల్చుని ఉండాల్సి వస్తోందని కొంతమంది నాయకులు చెబుతున్నారన్నారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనమైనా సులభంగా అవుతుందేమో కానీ.. ఎంపీని కలవాలంటే చాలా కష్టమన్నారు. ఎంపీ అభ్యర్థిగా షర్మిలకు, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్‌.డి.విజయజ్యోతికి ఓటు వేయాలని కోరారు. 

బద్వేలు గ్రామీణ : బద్వేలు మండలం తిమ్మరాజుపల్లె గ్రామం లో శుక్రవారం బద్వేలు కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్డీ విజయజ్యోతి ఆధ్వర్యం లో ఇతర పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్‌ లో చేరారు. ఈ సందర్భంగా విజయజ్యోతి మాట్లాడుతూ బద్వేలు అసెంబ్లీ లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అచ్యుతరాజు, అన్వర్‌, నరసింహ, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని