logo

వైకాపా కంచుకోటకు బీటలు

వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్‌, ప్రతాప్‌, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి.

Published : 04 May 2024 05:29 IST

తెదేపాలోకి వలసలు

తెదేపాలో చేరిన వారితో బీటెక్‌ రవి

లింగాల, న్యూస్‌టుడే: వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్‌, ప్రతాప్‌, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. వీరికి మాజీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌రవి  కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  అంబకపల్లె, మురారిచింతల, కోమన్నూతల గ్రామాల్లో భార్య లతారెడ్డి, కుమారుడు రామిరెడ్డి, తమ్ముడు జోగిరెడ్డి, భరత్‌రెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పింఛనుదారుల అవస్థలకు సీఎం జగన్‌ కారణమని ఆరోపించారు. మురారిచింతల గ్రామాన్ని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దత్తత తీసుకున్నారని అభివృద్ది ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తెదేపా మండల బాధ్యుడు విశ్వనాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్‌, శ్రీనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  


తెదేపాలో చేరిన వేముల మాజీ ఎంపీపీ

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన రాజ్‌గోపాల్‌రెడ్డి

వేంపల్లె, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో వైకాపాకు చెందిన వేముల మాజీ ఎంపీపీ దుగ్గన్నగారిపల్లె రాజ్‌గోపాల్‌రెడ్డి, దుగ్గిరెడ్డిలు తెదేపాలో చేరారు. గురువారం రాత్రి కడపలో తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌రవి ఆధ్వర్యంలో వారు చంద్రబాబును కలిసి ఆయన సమక్షంలో పార్టీలోకి చేరారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని