logo

అయ్యో పాపం...!

మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు.

Published : 04 May 2024 05:40 IST

పింఛన్లకు బ్యాంకుల వద్ద పండుటాకుల పడిగాపులు

నందలూరులో బ్యాంకు వద్ద మహిళల పడిగాపులు

మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. నిప్పులు చెరుగుతున్న ఎండ, ఉక్కపోతతో నానా తంటాలు పడ్డారు. దప్పిక తీర్చుకునేందుకు తాగునీటి కోసం పడరాని పాట్లు పడ్డారు. గత నెలలో సచివాలయాల వద్ద జరిగిన పింఛన్ల పంపిణీలోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఈ నెల బ్యాంకుల వద్ద పడరాని పాట్లు పడుతున్నామని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌, వైకాపా ప్రభుత్వ అనాలోచిత, కుట్రపూరిత చర్యలతో తామంతా అవస్థలు పడుతున్నామని ఆక్రోశం వెళ్లగక్కారు.

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ, నిమ్మనపల్లె, పీలేరు గ్రామీణ, సంబేపల్లె, నందలూరు

దేవపట్ల కెనరా బ్యాంకుకు ఆటోలో వస్తున్న పింఛనుదారులు

 

పీలేరులోని బ్యాంకు సేవా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధులు

 

నిమ్మనపల్లెలో ఎర్రటి ఎండలో నడిచి వస్తున్న గొనము వెంకటమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని