logo

జగన్‌ పాపానికి ఇద్దరి బలి

పింఛను కోసం బ్యాంకులు, ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 04 May 2024 05:32 IST

బ్యాంకులో పింఛను తీసుకునేందుకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి

 రామయ్య (పాతచిత్రం), ఎల్లమ్మ (పాతచిత్రం)

గత నెలలో పింఛన్లు తీసుకోవడానికి సచివాలయాలకు నానా అవస్థలు పడుతూ వచ్చిన అవ్వాతాతల్లో 32 మంది ప్రాణాలు విడిచినా సీఎం జగన్‌ రాతి గుండె కరగలేదు. ఈ నెలలో బ్యాంకు ఖాతాలకు పింఛన్లు జమ చేసి తమ స్వార్థ రాజకీయాలకు పేదల ప్రాణాలు బలితీసుకుంటున్నారు.

బద్వేలు గ్రామీణ, బద్వేలు, న్యూస్‌టుడే: పింఛను కోసం బ్యాంకులు, ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. బద్వేలు పట్టణంలోని అమ్మవారిశాలవీధిలో నివాసముంటున్న వల్లంకొండు రామయ్య (72) వడదెబ్బకు గురై మృతి చెందారు. ఈయన పింఛను కోసం బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో నగదు జమ కాలేదు. ఆధార్‌ కేంద్రానికి వెళ్లి ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. దీంతో ఆధార్‌ కేంద్రానికి వెళుతూ వడదెబ్బకు గురై ఇంటికి తిరిగొచ్చిన గంటలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  • స్థానిక సురేంద్రనగర్‌లో ఎల్లమ్మ (63) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందారు. ఈమె గురువారం పింఛ,ను కోసం బ్యాంకు వద్దకు వెళ్లారు. ఆమెకు రెండు బ్యాంకుల్లో  ఖాతాలు ఉన్నాయి. ఏ బ్యాంకులో పింఛను పడిందో తెలియక రెండు బ్యాంకుల చుట్టూ పట్టణంలో ఎండకు తిరిగారు. ఎస్‌బీఐలో పింఛను పడిందని గుర్తించి పింఛను తీసుకుని బ్యాంకు నుంచి బయటకు రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుమారుడు రామయ్య స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వడదెబ్బకు గురైనట్లు గుర్తించిన వైద్యులు చికిత్స చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని