logo

తెదేపాతో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా అన్నారు.

Published : 08 May 2024 05:37 IST

కురబల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా ప్రభుత్వంలోనే కురబ సామాజిక వర్గానికి భరోసా లభిస్తుందని వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా అన్నారు. మంగళవారం నీరుగట్టువారిపల్లె అయోధ్యనగర్‌లోని కల్యాణ మండపంలో కురబల ఆత్మీయ సమావేశం జరిగింది. కురబ సంఘం నాయకులు షాజహాన్‌బాషాకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చారన్నారు. కురబలు ఏకతాటిపైకి వచ్చి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఒక్క రోజైనా మీ సమస్యలపై మాట్లాడారా..? అని ప్రశ్నించారు. ఓట్లు కోసం వైకాపా నాయకులు అబద్దాలు చెబుతారని వారి మాటలు నమ్మొద్దని కోరారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ చినబాబు మాట్లాడుతూ కురబ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెదేపా సీనియర్‌ నాయకుడు రాటకొండ బాబురెడ్డి, భాజపా నాయకులు భువనేశ్వరి సత్య, డీఆర్‌ జగదీష్‌, కురబ సంఘం నాయకులు రెడ్డిప్రసాద్‌, మురళి, కప్పల శ్రీరాములు, కప్పల వెంకటరమణ, కొత్తపల్లె మాజీ సర్పంచి శ్రీనివాసులు, నాగభూషణం, చంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు