logo

ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం

తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్‌డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 05:48 IST

ముద్దనూరు, న్యూస్‌టుడే: తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులే ముద్దనూరులో కనిపిస్తున్నాయని, వైకాపా ప్రభుత్వం చేపట్టింది ఏమీ కనిపించడంలేదని ఎన్‌డీఏ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముద్దనూరు, యమవరం, చింతకుంట, శెట్టివారిపల్లె, వేల్పుచర్ల, ఉప్పలూరు, నల్లబల్లె, రాజుగురువాయిపల్లె తదితర గ్రామాల్లో మంగళవారం జరిగిన ఎన్‌డీఏ రోడ్డుషోలో తన చిన్నాన్న, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డితో కలిసి ఆయన రోడ్డుషోలో పాల్గొన్నారు. భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో  రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం జరగలేదని, మండలంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలుగా ఉన్నాయని, చెరువులు తెగిపోయాయని అన్నారు. చంద్రబాబు విజన్‌తో రాష్ట్రంలో మంచి రాజధాని వస్తుందని రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతాయన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి తన చిన్నాన్నను, సైకిల్‌ గుర్తుపై ఓటేసి తనను అత్యధిక ఆధిక్యతతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.


వైకాపా నియంత, రాక్షస పాలనను సాగనంపేందుకు సిద్ధం

దువ్వూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో వైకాపా నియంత, రాక్షస, అరాచక పాలనకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు ద్వారా చరమగీతం పాడాలని మైదుకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌, తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి పిలుపునిచ్చారు. దువ్వూరు మండలం నీలాపురం, దాసరిపల్లె, బాలాయపల్లె, మదిరేపల్లె, పెద్దశింగనపల్లె గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు రోడ్‌షో నిర్వహించి ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెదేపా అధికారంలోకి రాగానే రాజోలి జలాశయం నిర్మిస్తామనీ, కేపీ ఉల్లి కొనుగోలు కేంద్రం,  సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు, ఉచితంగా ఇసుక, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పండగలకు తోఫా తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మైదుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కారపురెడ్డి సంజీవరెడ్డి, సంఘన శేఖర్‌రెడ్డి, వీరరాఘవ, కొండయ్య, బాలవీరన్న, నరసింహులు, రాఘవ, కారపురెడ్డి యల్లాలరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు