logo

పరిస్థితి బాగోలేదు... రంగంలోకి దిగండి!

పోలింగ్‌ సమీపిస్తుండగా వైకాపాలో అలజడి మొదలైంది. వాలంటీర్లను వేడుకుని సమీకరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పరిస్థితి బాగోలేదంటూ.. రంగంలోకి దిగాలంటూ విన్నవిస్తోంది.

Published : 09 May 2024 04:48 IST

వాలంటీర్లకు వైకాపా వేడుకోలు
ఇంటింటికీ వెళ్లమని విన్నపాలు

ఈనాడు, కడప : పోలింగ్‌ సమీపిస్తుండగా వైకాపాలో అలజడి మొదలైంది. వాలంటీర్లను వేడుకుని సమీకరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పరిస్థితి బాగోలేదంటూ.. రంగంలోకి దిగాలంటూ విన్నవిస్తోంది.‘సిద్ధం’ పేరిట నియోజకవర్గాల వారీగా వాట్సప్‌ గ్రూపుల్లో వాయిస్‌ మెసేజ్‌లు, సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి.  ‘జగనన్న కోసం సిద్ధం’ సామగ్రిని తీసుకుని ఇంటింటికి వెళ్లాలని, ఓటర్లను కలవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లు చాలా మంది విధులకు దూరమయ్యారు. కొందరిని బలవంతంగా వైకాపా నేతలు రాజీనామాలు చేయించడం, దీనికి చాలామంది మొరాయించడం, నాయకుల కంటికి కనిపించకుండా పోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిలో వాలంటీర్లు చాలా మంది అందుబాటులో లేకుండాపోయారు. నేతలు వాలంటీర్ల ఇళ్లకెళ్లి వెతుకులాట మొదలుపెట్టారు. అందుబాటులో ఉండేవారి ఫోన్‌ నంబర్ల ఆధారంగా వాట్సప్‌ గ్రూపు రూపొందించినా చాలామంది స్పందించడంలేదు.  వాట్సప్‌ గ్రూపుల్లో మాత్రం.. పరిస్థితులు  ఆశాజనకంగా లేవని,  రంగంలోకి దిగాలని, ఎవరు ఎంత భయపెట్టినా వెనక్కి తగ్గవద్దని, ఏమాత్రం తేడా వచ్చినా  నష్టపోతారనే హెచ్చరికలు చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన వాలంటీర్లల ద్వారా సిద్ధం సామగ్రితో ఇంటింటికి పంపించే ప్రయత్నం చేశారు. ప్రొద్దుటూరులో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటికి వైకాపా స్టిక్కర్లు అతికిస్తున్నారు. దీన్ని తెదేపా అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలింగ్‌ వరకు ఓటర్లపై నిఘా పెట్టాలని, అందరూ హాజరయ్యేలా, వైకాపాకు ఓటేసేలా చేయాలని సూచిస్తున్నారు.  క్షేత్రస్థాయికి వెళ్లి మీరు సెల్ఫీలు తీసుకుని గ్రూపులో ఫొటోలు పెట్టాలనే సూచనలు ఎవరూ పాటించడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు