logo

Cyber Crime: మహేశ్‌బ్యాంక్‌పై సైబర్‌ దాడికి పాల్పడింది వారే!

ఏపీ మహేశ్‌బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు హ్యాకర్లను గుర్తించారు... పంజాబ్‌లోని పాటియాలలో నివాసముంటున్న బల్వీందర్‌ సింగ్‌, డేవిడ్‌ కుమార్‌లను...

Published : 15 May 2022 08:39 IST

సిమ్‌కార్డులు సరఫరా చేసిన వారి ద్వారా హ్యాకర్ల గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ మహేశ్‌బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు హ్యాకర్లను గుర్తించారు... పంజాబ్‌లోని పాటియాలలో నివాసముంటున్న బల్వీందర్‌ సింగ్‌, డేవిడ్‌ కుమార్‌లను నాలుగురోజుల క్రితం అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి హ్యాకర్లకు సంబంధించిన విషయాలు రాబట్టారు.వీరిద్దరూ హ్యాకర్లకు సిమ్‌కార్డులు సరఫరా చేశారు. సిమ్‌కార్డుల ద్వారా రివర్స్‌ ఇన్వెస్టిగేషన్‌ పద్ధతిలో పరిశోధన కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల్లో వీరి వివరాలు తెలిసే అవకాశాలున్నాయని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.

ఇమ్రాన్‌ దుబాయి వెళ్లినా.. ముంబయిలో ఉంటున్న ఇమ్రాన్‌ ధ్యాన్‌సే ఈ ఏడాది జనవరిలో ఓ నైజీరియన్‌ను కలిశాడు. కమీషన్‌ ఆశ చూపి జనవరి 23, 24 తేదీల్లో మహేష్‌ బ్యాంక్‌పై సైబర్‌దాడికి పాల్పడ్డ నిందితులు ఇమ్రాన్‌ ఖాతాలో రూ.52లక్షలు జమ చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్‌ దుబాయికి వెళ్లాడు. పోలీసులు అతడి బ్యాంక్‌ ఖాతాలోని రూ.52లక్షలను స్తంభింపజేశారు. అతడిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. పదిహేను రోజుల క్రితం ముంబయికి రాగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని