1.5 కి.మీ.. 30 చెరువులు
నంద్యాల మండలం రాయమాల్పురం క్రాస్ రోడ్డు నుంచి మునుగాలకు వెళ్తే దారి అధ్వానంగా మారింది. 1.5 కి.మీ తారురోడ్డుపై 30కి పైగా గుంతలు పడ్డాయి.
న్యూస్టుడే, నంద్యాల గ్రామీణం: నంద్యాల మండలం రాయమాల్పురం క్రాస్ రోడ్డు నుంచి మునుగాలకు వెళ్తే దారి అధ్వానంగా మారింది. 1.5 కి.మీ తారురోడ్డుపై 30కి పైగా గుంతలు పడ్డాయి. వర్షాలకు వాటిలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈ మార్గంలో పోలూరు, మునుగాల, రాయమాల్పురం గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ద్విచక్ర వాహనాలపై నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోడ్డుకు 2017లో మరమ్మతులు నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ నిర్వహణ చేపట్టకపోవడంతో దారి దారుణంగా మారింది. వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.
పట్టణ దారులూ పట్టవు
న్యూస్టుడే, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని షాదీఖానా రహదారి గోతులమయంగా మారింది. టీఎం మిల్లు నుంచి షాదీఖానా వరకు దారంతా గుంతలే కనిపిస్తున్నాయి. ఇక్కడ రహదారి వేసేందుకు రూ.30 లక్షలతో టెండర్లు పిలిచినా గతంలో కౌన్సిల్ తీర్మానం ఆమోదించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
ఏరులై పారుతున్న ఊరి దారులు!
మంత్రాలయం గ్రామీణం, న్యూస్టుడే: మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో ఏ దారి చూసినా చెరువును తలపిస్తోంది. రహదారులు గుంతలమయంగా మారడం.. గత కొంతకాలంగా తట్టెడు మట్టిపోయకపోవడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దఎత్తున నీళ్లు నిలిచి ఏరులై ప్రవహిస్తున్నాయి. ఉరుకుంద - హాల్వి రహదారిపై పదుల సంఖ్యలో చెరువులు దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో కోసిగి-హాల్వి బస్సు సర్వీసులు రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబు సంతకం.. జనం సంతసం
[ 14-06-2024]
ఐదు సంతకాలు... మెగా డీఎస్సీ ప్రకటన.. నైపుణ్య గణన నిర్ణయంతో యువత.. భూ హక్కు చట్టం రద్దుతో కర్షకులు, న్యాయవాదులు.. పింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు.. -
రక్త బంధువులు.. ప్రాణ రక్షకులు
[ 14-06-2024]
అత్యవసర సమయాల్లో రోగులు.. క్షతగాత్రుల ప్రాణాలు నిలిపే సంజీవని రక్తమే. సకాలంలో అవసరమైన గ్రూపు రుధిరం అందక ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు కొందరు దాతల్ని కదిలించాయి. -
చెత్త పన్ను ఎత్తేశారు
[ 14-06-2024]
వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను విధించి.. పట్టణ ప్రజలను వేధించింది. కాలనీల్లో ఇళ్ల ముందుకు వెళ్లడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, పన్ను చెల్లించకపోతే.. -
ఆర్యూలో దస్త్రాలు గల్లంతు
[ 14-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు, విలువైన పత్రాలు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.. పలు అంశాలకు సంబంధించి స.హ. చట్టం కింద వివరాలు కోరినా అధికారులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
వరద.. అధికారుల అప్రమత్తత
[ 14-06-2024]
తుంగభద్ర వరదపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవాహ వివరాలు ఎప్పటికప్పుడు వెంటనే తెలియజేయాలని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్ బాషా ఆదేశించారు. -
పతకాల కిక్
[ 14-06-2024]
చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న ఆ విద్యార్థులు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కరాటేలో రాటుదేలుతూ మాస్టర్ రమణ వద్ద తర్ఫీదు పొందుతూ మెలకువలు తెలుసుకుంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు. -
బడి గంట మోగింది
[ 14-06-2024]
సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పాఠశాలలకు వెళ్లారు. -
ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి
[ 14-06-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవంతంగా పని చేశారని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు వీసీహెచ్ వెంగళ్రెడ్డి కొనియాడారు. -
సేవా గుణంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తి
[ 14-06-2024]
ప్రజలకు వార్తా సమాచారం అందించడంతోపాటు సేవా దృక్పథంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్ బాషా అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్
-
మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు: చంద్రబాబు
-
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు: వైరల్గా అధ్యక్షుడి వ్యవహారశైలి