Eluru: మహిళా కానిస్టేబుల్‌పై జులుం.. చేయిచేసుకున్న ట్రాఫిక్ పోలీస్
సివిల్ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు.
ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: సివిల్ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు పాతబస్టాండు కూడలిలో గురువారం చోటుచేసుకుంది. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ పాతబస్టాండు కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ తన స్నేహితురాలిని స్కూటీపై ఎక్కించుకుని వస్తుండగా ఆపాడు. తాను కానిస్టేబుల్‌నని చెప్పినా వినకుండా ఐడీ కార్డు చూపించమని దురుసుగా ప్రవర్తిస్తూ.. బండి తాళాలు లాక్కున్నాడు. ఆమె అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుండగానే చేయి చేసుకున్నాడు. ఆమె నోటి వెంట రక్తం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బాధితురాలు గతంలో ఏలూరు సబ్ డివిజన్లో పని చేశారు. తరువాత బదిలీపై తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. మహిళపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడికి పాల్పడటంతో స్థానికులు అక్కడ గుమిగూడారు. ఈలోగా ఆమె సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం పెద్దది కాకుండా కొంతమంది అధికారులు సర్దుబాటు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను పిలిపించి మందలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్‌లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 17 మంది మృతి
-
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా?
-
హెచ్డీఎఫ్సీ నుంచి పిక్సెల్ పే క్రెడిట్ కార్డు.. రివార్డులు మీకు నచ్చినట్టుగా..
-
ప్రపంచంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదాలివే..
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!