icon icon icon
icon icon icon

Amit Shah: పటేల్‌ కృషి వల్లే రజాకార్ల నుంచి హైదరాబాద్‌ విముక్తి: అమిత్‌ షా

తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా అన్నారు.

Updated : 20 Nov 2023 16:23 IST

జనగామ, కోరుట్ల: తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల (Telangana News) ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా (Amit shah) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల, జనగామలో నిర్వహించిన భాజపా సకల జనుల విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా పాల్గొన్నారు. ఎన్నికల్లో భాజపాను (BJP) ప్రజలు గెలిపించాలని కోరారు.

‘‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి వల్ల రజాకార్ల నుంచి హైదరాబాద్‌ (Hyderabad) రాష్ట్రం విముక్తి పొందింది. ఒవైసీకి భయపడి సీఎం కేసీఆర్‌ (KCR) విమోచన దినోత్సవాలు జరపడం లేదు. భాజపా ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం. బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తాం. భారాస, కాంగ్రెస్‌, ఎంఐఎం కుటుంబ పార్టీలు. భాజపా తెలంగాణ ప్రజల పార్టీ. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మోదీ కొత్త పార్లమెంట్‌ నిర్మించి దేశం గర్వించేలా చేశారు. భాజపా వస్తే కుటుంబ పార్టీ నుంచి తెలంగాణకు విముక్తి లభిస్తుంది. మోదీ హయాంలోనే తెలంగాణకు సరైన న్యాయం లభిస్తుంది. మోదీ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరింది’’ అని అమిత్‌ షా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img