icon icon icon
icon icon icon

Amit Shah: మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దాం: అమిత్‌ షా

మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు.

Published : 01 May 2024 22:32 IST

హైదరాబాద్‌: మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. భాజపాను 400 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌  ఎంపీ అభ్యర్థులు కిషన్‌రెడ్డి, మాధవీలతకు మద్దతుగా అమిత్‌ షా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. లాల్‌ధర్వాజా ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్‌ షో సుధా టాకీస్‌ వరకు కొనసాగింది. భాజపా శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు సాగారు. అమిషా పర్యటన సందర్భంగా లాల్‌ధర్వాజా నుంచి సుధా టాకీస్‌ వరకు ప్రధాన రహదారి కాషాయమయమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img