icon icon icon
icon icon icon

Bandi Sanjay: కాంగ్రెస్‌ అలా నిరూపిస్తే పోటీ నుంచి వైదొలుగుతా.. : బండి సంజయ్‌

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ మోసగించిందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు.

Updated : 27 Apr 2024 14:13 IST

కరీంనగర్‌: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ మోసగించిందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని గుర్తుచేశారు. తమ మేనిఫెస్టో ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీత అని చెప్పారన్నారు. గతంలో హామీలు నిలబెట్టుకోనందుకే భారాసను ప్రజలు బొందపెట్టారని దుయ్యబట్టారు. 

‘‘మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేసినట్లు కాంగ్రెస్‌ ఆధారాలు చూపాలి. ఆసరా పింఛన్లు రూ.4 వేలు, విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చినట్లు చూపితే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నిరూపించలేకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా? ఎల్లుండి(సోమవారం) వరకు నిరూపిస్తే నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటా. లేదంటే 15 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ నుంచి విరమించుకుంటుందా?’’ అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img