icon icon icon
icon icon icon

Jagadish Reddy: అభివృద్ధిపై జానారెడ్డికి సవాలు విసిరిన భారాస ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాలు విసిరారు. 

Published : 02 May 2024 23:09 IST

హాలియా: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాలు విసిరారు. సూర్యాపేట లేదా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. భారాస నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా హాలియాలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, భాజపాకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 35 ఏళ్లుగా జానారెడ్డిని మోసిన నాగార్జునసాగర్‌ ప్రజలు ఇప్పుడు ఆయన ఇద్దరు కుమారులను మోయాలా అని అన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, పెద్ద తలకాయ జానారెడ్డి ఉండి కూడా పంటలు ఎండబెట్టి రైతులను ఆగం పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, భారాస నాయకులు నోముల భగత్‌, కంచర్ల భూపాల్‌ రెడ్డి, బడుగులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img