icon icon icon
icon icon icon

Bajireddy Goverdhan: మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేయొద్దు: భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated : 03 May 2024 00:06 IST

నిజామాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరారు. రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం భారాస, కేసీఆర్‌ మాత్రమేనని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను మభ్యపెట్టిందని విమర్శించారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భారాస జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img