icon icon icon
icon icon icon

BSP: అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ కలలను సాకారం చేయాలి: మాయావతి

అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ కలలను మనం సాకారం చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు.

Published : 22 Nov 2023 16:05 IST

సూర్యాపేట: అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ కలలను మనం సాకారం చేయాలని బీఎస్పీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) ప్రచారంలో భాగంగా బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన ప్రచారసభలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. యూపీ తరహాలో తెలంగాణలోనూ బీఎస్పీని ఆదరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా వాటిని అమలు చేయట్లేదన్నారు. బీఎస్పీని గెలిపిస్తే ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మాయావతిని బీఎస్పీ నాయకులు గజమాలతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img