icon icon icon
icon icon icon

కడప

కడప లోక్‌సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్‌ కేటగిరిలోనే ఉంది. 

Published : 29 Apr 2024 16:36 IST

లోక్‌సభ పరిధిలోని  అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు (ఎస్సీ) శాసనసభా స్థానాలు దీని పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 16,18,887 ఓటర్లు ఉండగా, పురుషులు 7,93,421 మంది, మహిళలు 8,25,242 మంది ట్రాన్స్‌ జెండర్లు 224 మంది ఉన్నారు.

2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డిపై వైకాపా అభ్యర్థి వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా నుంచి మరోసారి అవినాష్‌రెడ్డి పోటీ చేస్తుండగా, తెదేపా నుంచి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల పోటీ చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

  • కడప లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1952: ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ)
  • 1957: వీఆర్ రెడ్డి (కాంగ్రెస్)
  • 1962: ఎ.ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ)
  • 1967: ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ)
  • 1971: ఎ.ఈశ్వర్‌రెడ్డి (సీపీఐ)
  • 1977: కందుల ఓబుల్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1980: ఓబుల్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1984: డీఎన్ రెడ్డి (తెదేపా)
  • 1989: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1991: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1996: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1998: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 1999: వైఎస్‌ వివేకానందరెడ్డి (కాంగ్రెస్)
  • 2004: వైఎస్‌ వివేకానందరెడ్డి (కాంగ్రెస్)
  • 2009: వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్)
  • 2014: వైఎస్‌ అవినాష్‌రెడ్డి (వైకాపా)
  • 2019: వైఎస్‌ అవినాష్‌రెడ్డి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img