China: చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి

బీజింగ్‌: దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు.

Updated : 01 May 2024 12:17 IST

బీజింగ్‌: దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో బుధవారం ఓ హైవే రోడ్డులో కొంత భాగం కుప్పకూలిపోవడంతో19 మంది మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో కొంత భాగం బుధవారం తెల్లవారు జామున 2:10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాల్లోని 49 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు, అధికారులు దాదాపు 500 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. క్షయగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో 19 మంది మృతి చెందారు. మరో ముప్ఫై మంది తీవ్రంగా గాయపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. వీడియోలో అకస్మాత్తుగా రోడ్డు నేలలోకి దిగబడి పోవడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు లోతైన గోతిలో పడిపోయాయి. అందులోంచి మంటలు, పొగలు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. రహదారి కుప్పకూలడానికి గల కారణాన్నిపేర్కొనలేదు. గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో ఇటీవల విపరీతమైన వాతావరణ మార్పులు, వరదలు, సుడిగాలులు సంభవించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని