Tamil Nadu: తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.    

Updated : 01 May 2024 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళనాడు (Tamil Nadu)విరుధ్‌నగర్‌ జిల్లాలోని కరియపట్టి  సమీపంలోని క్వారీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక తెల్లటి భవనం వద్ద భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. దీనిలో క్వారీకి సంబంధించిన పేలుడు పదార్థాలను భద్రపరిచినట్లు అనుమానిస్తున్నారు. శకలాల్లో పేలుడు పదార్థాల ఆనవాళ్లను అధికారులు సేకరిస్తున్నారు. 

ఇక్కడి క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిలో కనీసం భద్రతా ప్రమాణాలను పాటించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే ఓవర్‌లోడ్‌ ట్రక్కుల కారణంగా చాలా ప్రమాదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ పేలుడు ఘటనకు కొన్నాళ్ల ముందే క్వారీని తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే జిల్లాలోని టపాసుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి 10 మంది మరణించారు. నాడు కెమికల్‌ మిక్స్ యూనిట్‌లో ఇది చోటు చేసుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని