icon icon icon
icon icon icon

CM Revanth reddy: బలహీన వర్గాల కోసం ఈటల ఏం చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి

గతంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బలహీనవర్గాల కోసం ఏమైనా చేశారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 06 May 2024 21:37 IST

హైదరాబాద్‌: గతంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బలహీనవర్గాల కోసం ఏమైనా చేశారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డికి మద్దతుగా ఉప్పల్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో రేవంత్‌ ప్రసంగించారు. పంపకాల్లో కేసీఆర్‌తో తేడా వచ్చి రాజేందర్‌ భారాస నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. అంతేతప్ప ప్రజల కోసం కాదని ఆరోపించారు. ఉప్పల్‌లో పనులు నిలిచిపోయిన ఫ్లైఓవర్‌ గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా ఈటల అడిగారా అని నిలదీశారు. కరోనా సమయంలో సీఎస్‌ఆర్‌ నిధులు దోచుకుతింటుంటే నోరెత్తలేదన్నారు.

‘‘లోక్‌సభ ఎన్నికల్లో భారాస పోటీలోనే లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. 40 లక్షల కుటుంబాలు రూ.500కే సిలిండర్‌ తీసుకుంటున్నాయి. దాదాపు 50లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందుతున్నాయి. కాంగ్రెస్‌ శ్రేణుల ఉత్సాహం ఈనెల 13 వరకు ఇలాగే కొనసాగాలి. సునీతా మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img