icon icon icon
icon icon icon

Telangana News: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై భారాస ఫిర్యాదు.. 48గంటల్లో వివరణ ఇవ్వాలన్న ఈసీ

భారాస అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు.

Published : 10 May 2024 21:19 IST

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌కు సీఈవో వికాస్‌ రాజ్‌ నోటీసులు జారీ చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి దూషిస్తున్నారని.. అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని భారాస ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోన్న సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది. 

భారాస ఫిర్యాదు ఆధారంగా వివరణ కోరిన సీఈఓ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. భారాస ఫిర్యాదును సీఈఓ కార్యాలయం పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కు పంపింది. ఫిర్యాదులోని అంశాలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా వివరణ రాకపోతే.. ఏమీ చెప్పేది లేదని భావించి, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించిన చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈఓ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img