icon icon icon
icon icon icon

Harish Rao: రుణమాఫీ అమలుపై రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: హరీశ్‌రావు

రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao) తెలిపారు. అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోపు నెరవేరుస్తానని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్‌ విసిరారు.

Published : 24 Apr 2024 14:08 IST

సంగారెడ్డి: రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao) తెలిపారు. అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోపు నెరవేరుస్తానని సీఎం ప్రమాణం చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. 

‘‘సీఎం సవాల్‌ను స్వీకరిస్తున్నా. ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా. సీఎం రేవంత్‌ కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలి. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా?

నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. ఆరు గ్యారంటీలను డిసెంబర్‌ 9న అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. ఆ మాట తప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటారా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చి 120 రోజులైంది.. మీ గ్యారంటీలు ఏమయ్యాయి?మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500, రైతులకు రూ.15,000, నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వలేదు?భారాస అంటే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img