icon icon icon
icon icon icon

TS News: తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంచిన ఈసీ

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Updated : 01 May 2024 19:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న జరిగే పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజకీయ పార్టీల వినతి, వడగాలులు, ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయం పెంచినట్లు ఈసీ తెలిపింది. ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img