icon icon icon
icon icon icon

దేవుళ్లపై ఒట్లు.. హామీలపై ప్రగల్భాలు

సీఎం రేవంత్‌రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి ముఖ్య దేవుళ్లపై ఒట్టు వేసి హామీలు అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 25 Apr 2024 02:59 IST

సీఎం రేవంత్‌పై సంజయ్‌ విమర్శ

చొప్పదండి, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా అక్కడి ముఖ్య దేవుళ్లపై ఒట్టు వేసి హామీలు అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. పైగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నానంటూ తనను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో బుధవారం నిర్వహించిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘భాజపా అభ్యర్థినైన నన్ను ఓడిస్తామని బీరాలు పలుకుతుంటే నవ్వొస్తోంది. పదేళ్లపాటు ప్రజలను రాచి రంపాన పెట్టిన కేసీఆర్‌ నీతిసూత్రాలు వల్లించడం విడ్డూరం. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసి ప్రజలు మోసపోయారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు నమ్మబోరు. ఎన్నికల నియమావళి జూన్‌ 4న ముగియగానే రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నా.. ఆగస్టు 15 నాటికి చేస్తామని సీఎం రేవంత్‌ చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పబ్బం కూడా గడుపుకొని ఈ హామీలన్నీ గాలికి ఒదిలేసే ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు’ అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్లమెంట్‌ కన్వీనర్‌ బి.ప్రవీణ్‌రావు, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్‌ శ్రవణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img