icon icon icon
icon icon icon

రాహుల్‌ ఫేక్‌ వీడియోలతో దుష్ప్రచారం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేరుతో భాజపా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు, సైబర్‌క్రైమ్‌ డీసీపీ ధార కవితలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ రాంచంద్రారెడ్డిలు ఫిర్యాదు చేశారు.

Updated : 30 Apr 2024 22:49 IST

ఈసీ, సైబర్‌ క్రైమ్‌లో కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేరుతో భాజపా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు, సైబర్‌క్రైమ్‌ డీసీపీ ధార కవితలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, లీగల్‌ సెల్‌ ఛైర్మన్‌ రాంచంద్రారెడ్డిలు ఫిర్యాదు చేశారు. సోమవారం వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ... రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌ నియోజకవర్గం రాహుల్‌ టీం పేరుతో ఫేక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఓడిపోతున్నామనే భయం భాజపా నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే ఇలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img