icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో చేరాలనుకునేవారు దీపా దాస్‌మున్షీని సంప్రదించాలి: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ చేరికల కమిటీ పని పూర్తయిందని పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి బుధవారం తెలిపారు.

Published : 02 May 2024 02:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ చేరికల కమిటీ పని పూర్తయిందని పీసీసీ చేరికల కమిటీ సభ్యుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి బుధవారం తెలిపారు. ఇకపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ అనుమతితోనే చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీలో చేరాలనుకునే వారు ఆమెను సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్‌ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన చాలామంది ఘర్‌ వాపసీలో భాగంగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img