icon icon icon
icon icon icon

ఏపీలో వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో వైకాపా ప్రచారం

వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది.

Published : 03 May 2024 06:21 IST

కరప, న్యూస్‌టుడే: వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. వాలంటీర్లు సెల్‌ఫోన్లను అధికారులకు అప్పగించినప్పటికీ యాభై కుటుంబాలకు చెందిన లబ్ధిదారులతో వారు నిర్వహించిన వాట్సప్‌ గ్రూపుల్లో ఇతరుల ద్వారా ప్రచారానికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. తమ ప్రచారాన్ని ఎక్కువ వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఓటర్లకు తొందరగా చేరవేయడం కోసం వైకాపా వర్గాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని కరప మండలంలో కొన్ని వాలంటీర్ల గ్రూపుల్లో ఈ మేరకు పోస్టులు పెడుతుండటం గమనార్హం. కురసాల కన్నబాబుకు ఓటేయాలంటూ ప్రచారం సాగిస్తుండటం కనిపిస్తోంది. ఈ విషయంపై కరప ఎంసీసీ అధికారి కె.అప్పారావును వివరణ కోరగా.. జనసేన పార్టీ వారు ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. బాధ్యులపై చర్యల కోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img