icon icon icon
icon icon icon

ఇంటి వద్దే ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు

లోక్‌సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

Published : 03 May 2024 06:23 IST

లోక్‌సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నవారిలో 23,248 మంది ఇందుకు అర్హులని గుర్తించారు. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌తో పాటు బ్యాలెట్‌ బాక్స్‌ను తీసుకుని.. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వారి సంతకాలు, వేలిముద్రలు తీసుకుని.. ఇంట్లోనే రహస్యంగా ఓటు వేయించారు.

న్యూస్‌టుడే, దుబ్బాక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img