icon icon icon
icon icon icon

భాజపాకు ఓట్లు అడిగే అర్హత లేదు: మంత్రి ఉత్తమ్‌

భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి భాజపా జాతీయ నాయకులు వరస కట్టారు.., కానీ తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Published : 05 May 2024 05:50 IST

హుజూర్‌నగర్‌, మఠంపల్లి- న్యూస్‌టుడే: భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి భాజపా జాతీయ నాయకులు వరస కట్టారు.., కానీ తెలంగాణకు ఏం చేశారో చెప్పకుండా మతపరమైన విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. భాజపా మతపరమైన రాజకీయాలతోనే ఉనికి చాటుకోవాలని చూస్తోందని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. రిజర్వేషన్ల రద్దుకు భాజపా యోచిస్తోందని, రిజర్వేషన్లు పెంచి అట్టడుగువర్గాలను ఆదుకోవాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తోందని తెలిపారు. తాను ఎంపీగా పార్లమెంటులో ఎస్టీ రిజర్వేషన్‌ పెంపుపై మాట్లాడినప్పుడు.. భాజపా, భారాసలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయని వివరించారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా, భారాస అభ్యర్థుల డిపాజిట్‌ గల్లంతవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత భారాస కనిపించదని, 20 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ భారాస, భాజపాలు రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img